Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన మోదీ!

  • మెట్రో ప్రారంభోత్సవంలో కేటీఆర్ కు మోదీ ప్రాధాన్యత
  • కేటీఆర్ ను తన పక్కకు పిలిచిన మోదీ
  • రైల్లో కూడా మోదీ పక్కనే కేటీఆర్
హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. మియాపూర్ లోని మెట్రో స్టేషన్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించిన తర్వాత, అక్కడి మెట్రో స్టేషన్ ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మెట్రోలో మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు వెళ్లి... మళ్లీ అక్కడ నుంచి మియాపూర్ కు తిరిగి వచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మోదీ అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. మెట్రో స్టేషన్ ప్రారంభం సందర్భంగా రిబ్బన్ కట్ చేసే సమయంలో మోదీ పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్ నిల్చున్నారు. ఆ సందర్భంగా కొంచెం దూరంగా ఉన్న కేటీఆర్ ను పిలిచి, తన పక్కన ఉంచుకున్నారు మోదీ.

అనంతరం మెట్రో రైల్లో కూడా తన పక్కనే కేటీఆర్ ను కూర్చోబెట్టుకున్నారు. మరోవైపు గవర్నర్ నరసింహన్ ఉండగా... ఆయన పక్కన కేసీఆర్ కూర్చున్నారు. రైల్లో మోదీ చాలా హుషారుగా గడిపారు. కేటీఆర్ తో మాట్లాడుతూ ఉల్లాసంగా కనిపించారు. అధికారులతో కూడా ముచ్చటించారు.
Narendra Modi
KTR
metro rail

More Telugu News